మీరే చేతికి షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ రూ.3వేల కోట్లు

మీరే చేతికి షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ రూ.3వేల కోట్లు

న్యూఢిల్లీ: యూరోపియన్ బ్యాంక్ బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ పారిబా  తమ ఇండియన్ రిటైల్ బ్రోకింగ్ కంపెనీ  షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొరియాకు చెందిన మీరే అసెట్ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.3,000 కోట్లకు అమ్మింది.  డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యిందని, త్వరలో అఫీషియల్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకొస్తుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొంటామని  2015 లో బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ పారిబా ప్రకటించింది. 2018  జనవరిలో ఈ డీల్ పూర్తయ్యింది. కాగా, ఈ యూరోపియన్ బ్యాంక్ వివిధ నాన్ బ్యాంకింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి ఎగ్జిట్ అవుతోంది. ఈ స్ట్రాటజీలో భాగంగానే షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్మేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి కూడా బయటకొచ్చేసింది.  బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ పారిబా కొచ్చి బేస్డ్ కంపెనీ  జియోజిత్ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34 శాతం వాటాను 2007 లో కొనుగోలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ వాటా 24.67 శాతానికి తగ్గింది.