హైదరాబాద్‌ వేదికగా యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్‌ వేదికగా యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

ఇరవై తొమ్మిదవ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్  డిసెంబర్ 6 నుండి 15 వరకు హైదరాబాద్‌‌లో జరగనుంది. 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24  చిత్రాలను ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌‌లో పది రోజులపాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ దీన్ని నిర్వహిస్తోంది.  ఆ వివరాలను తెలియజేసేందుకు సారధి స్టూడియోస్‌‌లో ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.  ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌ రెగ్యులర్‌‌‌‌గా జరగ్సాల్సిన అవసరం ఉందని, తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం దీనికి అవసరమని డైరెక్టర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ వీరశంకర్, దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కె.వి.రావు, సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.