- ఇంగ్లండ్‌తో స్పెయిన్ ఢీ
- రాత్రి 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
బెర్లిన్ : యూరోపియన్ ఫుట్‌చాంపియన్‌షిప్‌లో ఆఖరాటకు వేళయింది. రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్, తొలిసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న ఇంగ్లండ్ ఫైనల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి. ఇండియా టైమ్ ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగే తుదిపోరులో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆడిన ఆరు మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్‌కు వచ్చిన ఆ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
2012లో యూరో కప్ గెలిచిన తర్వాత మరో మెగా ఈవెంట్ టైటిల్ సాధించలేకపోయిన స్పెయిన్ తమకు అచ్చొచ్చిన టోర్నీలో మళ్లీ విజేతగా నిలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు గత ఎడిషన్ ఫైనల్లో చేజారిన కప్పును ఈసారి అందుకోవాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. 1966 వరల్డ్ కప్ తర్వాత 58 ఏండ్ల నుంచి ఇంగ్లిష్ టీమ్ మరే మేజర్ టోర్నీలోనూ నెగ్గలేదు.