హైదరాబాద్: యూరప్ మార్కెట్లలో తమ బయోసిమిలర్ క్యాన్సర్ డ్రగ్ రిటుక్సిమాబ్ క్యాండిడేట్‌ను అమ్మడానికి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) సానుకూలంగా స్పందించిందని హైదరాబాద్ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ప్రకటించింది. ఈఎంఏ అభిప్రాయాన్ని యూరోపియన్ కమిషన్ సమీక్షిస్తుంది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల్లో మార్కెటింగ్ ఆథరైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటారు.
యూరోపియన్ ఎకనామిక్ ఏరియా సభ్య దేశాలైన నార్వే, ఐస్‌లాండ్, లీచ్టెన్స్టెయిన్లకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ గతంలో రిటుక్సిమాబ్ డ్రగ్సబ్స్టెయిన్స్కు ఈయూ జీఎంపీ సర్టిఫికెట్ పొందింది.