
హైదరాబాద్,వెలుగు: ఈవీ కంపెనీ ప్యూర్ రెసిడెన్షియల్, కమర్షియల్ అవసరాల కోసం బ్యాటరీలను లాంచ్ చేసింది. ప్యూర్ పవర్ బ్రాండ్‌తో వీటిని మార్కెట్‌లోకి తెచ్చింది. రాబోయే 18 నెలల్లో దేశం మొత్తం మీద 300కి పైగా టచ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ప్యూర్ పవర్ బ్యాటరీల్లో ఏఐతో పనిచేసే పవర్ ఎలక్ట్రానిక్స్‌ను వాడమని తెలిపింది. ఇవి 10 ఏళ్ల వరకు పనిచేయగలుగుతాయని, -మెయింటెనెన్స్ అవసరం ఉండదని ప్యూర్ పేర్కొంది. కరెంట్ గ్రిడ్ అవసరాల కోసం ప్యూర్‌పవర్‌గ్రిడ్ పేరుతో వచ్చే ఏడాది ఎనర్జీ సొల్యూషన్లను కంపెనీ లాంచ్ చేయనుంది.