విద్యాభివృద్ధికి సంఘాలు కీలక పాత్ర పోషించాలి : ఈవీ నర్సింహారెడ్డి

విద్యాభివృద్ధికి సంఘాలు కీలక పాత్ర పోషించాలి : ఈవీ నర్సింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్ర పోషించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి కోరారు. సంఘాల నేతలు కేవలం టీచర్ల సమస్యలపైనే కాకుండా.. మారుతున్న సమకాలిన పరిస్థితులకు అనుగుణంగా బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. హైదరాబాద్​ దోమలగూడలోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్​లో పీఆర్టీయూటీఎస్​స్టేట్ జనరల్ సెక్రటరీ బీరెల్లి కమలాకర్ రావు రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ఈవీ నర్సింహారెడ్డి ముఖ్య​అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యారంగానికి కమలాకర్ రావు విశిష్టమైన సేవలందించారని ప్రశసించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పూల రవీందర్, టీచర్ల సంఘాల నేతలు సదానందం గౌడ్, లింగారెడ్డి పాల్గొన్నారు.