
ముంబై: హిండాల్కో ఇండస్ట్రీస్ శుక్రవారం పూణేలోని చకన్‌లో రూ.500 కోట్ల విలువైన ఈవీ కాంపోనెంట్ తయారీ ప్లాంట్‌ను మొదలుపెట్టింది. ఇక్కడ తేలికైన, క్రాష్- రెసిస్టెంట్ బ్యాటరీ సొల్యూషన్స్ తయారు చేస్తారు. రూ.500 కోట్ల మూలధన పెట్టుబడితో నిర్మించబడిన ఈ ఫెసిలిటీ ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది. కంపెనీ 10వేల అల్యూమినియం బ్యాటరీ ఎన్‌క్లోజర్‌లను ఎం అండ్ఎం లిమిటెడ్‌కు డెలివరీ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
ఇందుకోసం హిందాల్కోతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఎం అండ్ఎం లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ రాజేష్ జెజురికర్ అన్నారు. మహీంద్రాతో కలిసి తయారు చేసిన బ్యాటరీ ఎన్‌క్లోజర్ సంప్రదాయ స్టీల్ డిజైన్‌లతో పోలిస్తే 40 శాతం వరకు తక్కువ బరువు ఉంటుంది. డ్రైవింగ్రేంజ్ను 10 శాతం వరకు పెంచుతుంది. బ్యాటరీ త్వరగా వేడెక్కదు.