
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్రిగేటర్ ఈవీ91 టెక్నాలజీస్, బీ2బీ టూ-వీలర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించే బ్యాట్‌రీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ ఫైనాన్సింగ్ సర్వీస్‌లు అందించే ఈవీపేతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
ఈ కంపెనీలు కలిసి కార్పొరేట్ క్లయింట్లు, ఫ్లీట్ సర్వీస్ కంపెనీలకు 10 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను సప్లయ్ చేయనున్నాయి. ఇప్పటివరకు 1,000 ఈవీల కోసం ఆర్డర్‌లు వచ్చాయని ఈవీ91 టెక్నాలజీస్ ప్రకటించింది. 100 ఈవీలు పైలట్ ఫేజ్‌లో ఉన్నాయని తెలిపింది.