లండన్ వెళ్తున్న విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేసిన పైలట్

బ్యాంకాక్: లండన్​కు బయల్దేరిన ఫ్లైట్​లో ఓ ప్యాసింజర్ ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. తైవాన్​కు చెందిన ఇవా ఎయిర్​లైన్స్ విమానం బ్యాంకాక్​ నుంచి లండన్​కు బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్లలో ఒకరు బాత్​రూమ్​లో ఆత్మహత్యాయత్నం చేశాడు.  గమనించిన సిబ్బంది వెంటనే బయటకు లాక్కొచ్చి పైలట్​కు విషయాన్ని తెలియజేశారు.

దీంతో పైలట్ విమానాన్ని హిత్రూ ఎయిర్​పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని అధికారులు తెలిపారు. అప్పటికే రెడీగా ఉన్న డాక్టర్లు ఆ ప్యాసింజర్​ను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించాయి.