
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లను మంగళవారం మెరుగైన వైద్యానికి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినది తెలిసిందే. ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌ల బాడీలో బుల్లెట్లు దిగడంతో భద్రాచలంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఓఎస్డీ పంకజ్పరితోష్ నేతృత్వంలో హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.