ముంపు ప్రాంతాల వారికి ఈవీడీఎం శిక్షణ

ముంపు ప్రాంతాల వారికి ఈవీడీఎం శిక్షణ

హైదరాబాద్, వెలుగు : వరదల టైంలో తమకు తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలపై జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం అధికారులు ముంపు ప్రాంతాల వారికి శిక్షణ ఇస్తున్నారు. 2020 వరదల సమయంలో ఇబ్బందులు పడిన ప్రాంతాల్లోని యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 10న 120 మందికి, శనివారం మరో 224 మందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారిలో ఎక్కువగా యూత్

ఎన్జీఓల సభ్యులు ఉన్నారు. శిక్షణ తీసుకున్నవారు వలంటీర్లుగా పనిచేసేందుకు ముందుకురావాలని బల్దియా అధికారులు కోరుతున్నారు. నాగోలులోని డీఆర్ఎఫ్​ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ కొనసాగుతోంది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. శిక్షణ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారు 79816 65687లో సంప్రదించవచ్చని సూచించారు.