పాయింట్ ఒక్క శాతం తప్పున్నా సరి చేయాల్సిందే : సుప్రీంకోర్టు నోటీసులు

పాయింట్ ఒక్క శాతం తప్పున్నా సరి చేయాల్సిందే : సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో పేపర్ లీకులు, అవకతవకలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ  చేసింది. విచారణ సందర్భంగా..0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా దానిని పరిశీలించి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఇది హానికరం  అని జస్టిస్ విక్రమ్ నాఘ్ , ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

లక్షల్లో విద్యార్థులు పరీక్ష రాశారు..నీట్ పరీక్షలకోసం విద్యార్థులు ఎంతో శ్రమించారు... నీట్ పరీక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ప్రత్యర్థులు వేసినట్టుగా పరిగణించవద్దు.. తప్పులను సరిదిద్దుకోవాలని కేంద్రానికి, ఎన్ టీఏకు ధర్మాసనం చెప్పింది. ఎన్ టీఏ వెంటనే దీనిపై స్పందించాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 

నీట్ యూజీ 2024 వరుస పరీక్షల కారణంగా రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులలో ఒకరిని సుప్రీంకోర్టు గత వారం మందిలించింది. ఈ ప్రకటనలను కొట్టివేసిన న్యాయస్థానం, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు అలాంటి భావోద్వేాగ వాదనలు చేయొద్దని ఆదేశించింది. నీట్ కౌన్సెలింగ్ పై స్టే ఇవ్వబోమని మరోసారి స్పష్టం చేసింది.