కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో మీరు బరువు పెరిగారా? అయితే మీకు ఈజీగా కరోనా సోకే ప్రమాదమున్నట్లే. ఏ మాత్రం బరువు పెరిగినా అది కూడా కరోనా సోకడానికి కారణమవుతుందని యూకే శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విషయాన్ని ది లాన్సెట్ డయాబెటిస్ & ఎండోక్రినాలజీ ఓ జర్నల్‌లో ప్రచురించింది. కరోనావైరస్ విజృంభిస్తోన్న ఈ తరుణంలో బరువు పెరగడం కూడా కరోనా వ్యాప్తికి ఓ సూచనగా మారింది. కొన్ని వయసుల వాళ్లు అంటే 40 సంవత్సరాలలోపు వాళ్లకు ఇది ఎక్కువ ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆరోగ్యకరంగా ఉన్నా కూడా బాడీ మాస్ ఇండెక్స్ 23 కంటే ఎక్కువగా ఉన్న వాళ్లందరూ ఇప్పటికే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని యూకే పరిశోధకులు అంటున్నారు. బీఎంఐలో ప్రతి ఒక్క పాయింట్ పెరుగుదల ఆస్పత్రిలో చేరే అవకాశాన్ని 5% మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరే అవకాశాన్ని 10% పెంచుతుందని వారు కనుగొన్నారు.
ఈ ప్రభావం 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగాను మరియు మరియు ఇతర జాతులతో పోలిస్తే నల్లజాతీయులకు ఇదీ మరీ ఎక్కువగానూ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని దాదాపు 7 మిలియన్ల ప్రజల ఆరోగ్య రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.