న్యాచురల్స్టార్నాని ‘మజ్ను’తో టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel). కొన్ని సినిమాలకే ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. దీంతో తెలుగు పరిశ్రమకు మరో ఇలియానా దొరికేసిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ, వరుస ఫ్లాపులు ఈ హీరోయిన్ కొంపముంచాయి.
తమిళ్లో పరవాలేదనిపించినా తెలుగులో అను నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఎట్టకేలకు జపాన్ (Japan)లో కార్తి(Karthi)తో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందులోనూ అను రోల్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదనే టాక్ వస్తోంది. సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ హీరోయిన్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ బ్యూటీకి త్వరలోనే మంచి హిట్ దక్కాలని ఆమె ఫ్యాన్స్ కోరకుంటున్నారు.
ALSo READ :- బాలల దినోత్సవం.. ఈ సారి ఆ నగర విద్యార్థులు చేసుకోలేరు.. ఎందుకంటే
అను ఇమ్మాన్యుయేల్నటించిన ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజ రెడ్డి అల్లుడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ మూవీస్గా నిలిచాయి. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అను కెరీర్ ఆగిపోయింది అనుకునేలోపే జపాన్ తో తిరిగొచ్చింది. ఎంత లక్కీ భామ అయితేంటి? సినిమాలు ఆడకపోతే! అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.