బ్లూ టిక్స్ రాకున్నా సరే.. మెసేజ్ చూసినట్టు తెలుసుకోవచ్చు

బ్లూ టిక్స్ రాకున్నా సరే.. మెసేజ్ చూసినట్టు తెలుసుకోవచ్చు

వా ట్సాప్‌‌లో ఎవరికైనా మెసేజ్‌‌ సెండ్‌‌ చేస్తే వాళ్లు అది చూశారో, లేదో బ్లూటిక్స్‌‌ ద్వారా తెలుస్తుంది. అయితే కొందరు మాత్రం ఈ బ్లూటిక్స్‌‌ కనిపించకుండా సెట్‌‌ చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్లు మెసేజ్‌‌ చూసినా, చూడకపోయినా ఆ విషయం సెండ్‌‌ చేసిన వాళ్లకు తెలియదు. అయితే బ్లూటిక్స్‌‌ కనిపించకపోయినా, ఎదుటివాళ్లు మెసేజ్‌‌ చూశారో, లేదో తెలుసుకోవచ్చు. ఎవరైనా ‘రీడ్‌‌  రిసీట్​’ టర్న్‌‌ ఆఫ్‌‌ చేస్తే వాళ్ల బ్లూటిక్స్‌‌ సెండర్స్‌‌కు కనిపించవు. ఇతరుల బ్లూటిక్స్‌‌ వాళ్లు చూడలేరు. అయితే గ్రూప్‌‌చాట్‌‌లో ఇది పనిచేయదు. ఈ ఫీచర్‌‌‌‌లోనే ఒక చిన్న లోపం ఉంది. ‘రీడ్‌‌ రిసీట్​’ ఫీచర్‌‌‌‌ టర్న్ ఆఫ్‌‌ చేసుకున్నా, ఇది టెక్ట్స్‌‌ మెసేజెస్‌‌, వీడియో ఫైల్స్‌‌, ఇమేజెస్‌‌, ఇతర డాక్యుమెంట్ల విషయంలోనే పని చేస్తుంది. ఆడియో ఫైల్స్‌‌ విషయంలో పనిచేయదు.

అంటే ఆడియో ఫైల్స్‌‌ సెండ్‌‌ చేస్తే, రిసీవర్స్‌‌ ఈ ఫీచర్‌‌‌‌ ఆఫ్‌‌ చేసుకున్నా, బ్లూటిక్స్‌‌ కనిపిస్తాయి. కాబట్టి, బ్లూటిక్స్‌‌ కనిపించకుండా సెట్‌‌ చేసుకున్న వాళ్లలో ఎవరైనా మీ మెసేజ్‌‌ చూశారో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న వాయిస్‌‌ మెసేజ్‌‌ పంపండి. ఆ మెసేజ్‌‌ వాళ్లు రిసీవ్‌‌ చేసుకుంటే మీకు బ్లూటిక్స్‌‌ కనిపిస్తాయి. ఈ విషయంలో బ్లూటిక్స్‌‌ కనిపించకుండా దాయలేరు.

బ్లూటిక్స్‌‌ ఉన్నాసరే..

‘రీడ్‌‌ రిసీట్​’ ఫీచర్‌‌‌‌ టర్న్‌‌ ఆఫ్‌‌ చేసినప్పుడు మాత్రమే మీరు మెసేజ్‌‌ చూశారో, లేదో సెండర్స్‌‌కు తెలీదు. అయితే ఈ ఫీచర్‌‌‌‌ వాడుకోవడం అన్నిసార్లు, అందరికీ కుదరదు. మరైతే మీరు మెసేజ్‌‌ చూసినా, ఎదుటివాళ్లకు తెలియకూడదనుకుంటే ఎలా? దీనికీ ఒక చిన్న పరిష్కారం ఉంది.సాధారణంగా వాట్సాప్‌‌ నోటిఫికేషన్స్‌‌ మొబైల్‌‌ లాక్‌‌ స్క్రీన్‌‌పై కూడా కనిపిస్తాయి.ఏదైనా మెసేజ్‌‌ రాగానే మొబైల్‌‌ స్క్రీన్‌‌ అన్‌‌లాక్‌‌ చేయండి. డైరెక్ట్‌‌గా వాట్సాప్‌‌ చేయకూడదు, మెసేజ్ స్వైప్‌‌ చేయకూడదు. నోటిఫికేషన్‌‌పై లాంగ్‌‌ ప్రెస్‌‌ డౌన్‌‌ చేయండి.మెసేజ్‌‌ ఎక్స్‌‌పాండ్‌‌ అయి పూర్తి మెసేజ్‌‌ కనిపిస్తుంది. ఇలా చదివినా కూడా బ్లూటిక్స్‌‌ రావు. మళ్లీ యాప్‌‌ ఓపెన్‌‌ చేసి, మెసేజ్‌‌ చూసేవరకు బ్లూటిక్స్‌‌ కనిపించవు.

అయితే ఈ ఫీచర్‌‌‌‌ అన్ని ఫోన్లపై పనిచేయదు. ‘యాపిల్‌‌ ఐఓఎస్‌‌ 13, ఆండ్రాయిడ్‌‌ 9.0’ ఆపై వెర్షన్ల మొబైల్స్‌‌పై మాత్రమే పనిచేస్తుంది.

ఈ యాప్‌‌ కోసం ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) టెక్నాలజీ వాడుతున్నట్లు, దీనికోసం చాలా ఏళ్లుగా పరిశోధనలు కూడా చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌‌ కార్పొరేట్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ యాన్‌‌ జాన్సన్‌‌ చెప్పాడు.