కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటడు... కానీ రాజగోపాల్ ఉండడు : మంత్రి తలసాని

కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటడు... అదే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఇక్కడుండడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి తలసాని... హుజురాబాద్, దుబ్బాకలో గెలిచిన వాళ్ళు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతదని అంటున్నావు.. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి ఎటుపోయావని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కేసీఆర్ ని తిట్టడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాలన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిండు18000  కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. కానీ దానిపై ఏ సప్పుడూ లేదని ఎద్దేవా చేశారు.

60-,70సంవత్సరాలలో ఎవ్వరూ సాల్వ్ చేయలేని  ఫ్లోరోసిస్ సమస్యని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందన్న తలసాని... తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే 24 గంటల కరెంటు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు, రైతుబందు, రైతు భీమా, ఫించన్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ఈ ఎలక్షన్ తో ఒరిగిపోయేది లేదని.. నెక్స్ట్ ఇంకో సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ వస్తాయన్నారు. నాంపల్లి మండలం టౌన్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఆయన... మనకి ఇంకా ఏడాది పాటు మన ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడక కాంట్రాక్టు గురించి మాట్లాడున్నారన్నారు. మొన్నటి దాకా కాంట్రాక్టు నాది కాదు అన్నావ్ ఇప్పుడేమో నాది అంటున్నావని విమర్శించారు. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో మీకే తెలియాలని కామెంట్ చేశారు.