![దళితబంధు కారు బయటకు తీయొద్దు!](https://static.v6velugu.com/uploads/2022/06/Even-if-the-car-is-delivered-as-part-of-the-Dalitbandhu-scheme-the-beneficiary-should-not-drive-it_0WSvlE8Vdw.jpg)
కమలాపూర్, వెలుగు: దళితబంధు పథకంలో భాగంగా కారును డెలివరీ చేసినప్పటికీ దానిని లబ్ధిదారు నడపకూడదట.. లీడర్లు ప్రారంభించేవరకు కారును బయటకు తీయకుండా ఇంటి దగ్గరే ఉంచాలట.. దీనికి అంగీకరిస్తున్నట్లుగా లబ్ధిదారులతో కారు షోరూం యాజమాన్యం స్టాంప్ పేపర్‌పై అగ్రిమెంట్ రాయించుకుంటోంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళితబంధు లబ్దిదారుడు వరంగల్‌లోని కార్ల షోరూంలో స్విఫ్ట్‌డిజైర్ కారుకు అనుమతులు పొందాడు. అయితే యజమాన్యం కారు డెలివరీ టైంలో లబ్ధిదారులతో అగ్రిమెంట్రాయిస్తోంది. చాలా షోరూంలలో ఇలాంటి రూల్స్ పెట్టడం లేదని.. కానీ కొన్నిచోట్ల మాత్రం అగ్రిమెంట్ రాయించుకుంటున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అగ్రిమెంట్ రాయించుకోకుండా వెహికల్స్ డెలివరీ ఇయ్యాలని కోరుతున్నారు.