
చెన్నై: తమిళనాడులో నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలు చేస్తే తమ రాష్ట్రం 2 వేల సంవత్సరాలు తిరోగమనం చెందుతుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఎన్‌ఈపీ విషయంలో స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించిన ఒకరోజు తర్వాత స్టాలిన్ ఈ మేరకు స్పందించారు. కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని హెచ్చరించారు.
శనివారం కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కేవలం రూ.74 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 8 కోట్ల మంది మాట్లాడే సంస్కృతానికి మాత్రం రూ.1,488 కోట్లు కేటాయించారని ఫైర్ అయ్యారు. శనివారం కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కేవలం రూ.74 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం 8 కోట్ల మంది మాట్లాడే సంస్కృతానికి మాత్రం రూ.1,488 కోట్లు కేటాయించారని ఫైర్ అయ్యారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్లే తాము ఎన్ఈపీని వ్యతిరేకించడం లేదని, విద్యార్థుల భవిష్యత్తుపై, సమాజంపై తీవ్ర ప్రభావాలు చూపే ఇతర అంశాలు కూడా ఉన్నాయని స్టాలిన్ పేర్కొన్నారు.