అకౌంట్లో చిన్న తేడా వచ్చినా బరాబర్ ప్రశ్నిస్తా

ఆర్‌‌ మాధ‌‌వ‌‌న్ లీడ్ రోల్‌‌లో నటించిన తాజా చిత్రం ‘హిసాబ్ బరాబర్’. దర్శకుడు  అశ్విన్ ధీర్ రూపొందించిన ఈ సినిమా జనవరి 24నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రీమియర్‌‌‌‌కు సిద్ధమవుతోంది. తాజాగా ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. రైల్వే డిపార్ట్‌‌మెంట్‌‌లో చిరు ఉద్యోగి అయిన రాధే మోహ‌‌న్ శ‌‌ర్మ పాత్రలో మాధ‌‌వ‌‌న్  క‌‌నిపిస్తున్నాడు. 

ఆయ‌‌న ఓసారి త‌‌న బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారుల‌‌ను ప్రశ్నిస్తాడు. రైల్వే ఉద్యోగికి, బ్యాంక్ హెడ్‌‌కి మధ్య జరిగే ఈ పోరాటం ఆసక్తిని పెంచేలా ఉంది. జియో స్టూడియోస్, ఎస్‎పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.