ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా తమ హోటల్‌ను కూల్చి వేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్మేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె తన కుమారుడు అనీశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము ఫిల్మ్ నగర్లో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్‌ల నుంచి ల్యాండ్ లీజుకు తీసుకున్నామని, ఆ లీజు 2024 వరకు ఉందన్నారు.
లీజు ముగియక ముందే మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రాజకీయ బలంతో తమ హోటల్‌ను కూల్చి వేశారన్నారు. నోటీసులు కూడా తమకు అందలేదన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు తమకు సహకరించలేదని ఆరోపించారు.