- టీఆర్ఎస్ సభ్యత్వాల టార్గెట్ కోసం తిప్పలు.. కేడర్ జేబుకు చిల్లు
యాదాద్రి/వరంగల్ రూరల్, వెలుగు: ఒక్కో నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా మెంబర్షిప్చేయించాల్సి ఉండడంతో టీఆర్ఎస్కేడర్ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఎమ్మెల్సీ, బల్దియా, బై ఎలక్షన్ ప్రచారంతో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. ఇదే టైంలో కేవలం 15 రోజుల్లో ఒక్కో నియోజకవర్గానికి 50 వేలు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనే సీఎం కేసీఆర్ ఆర్డర్‍తో ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే యూత్ ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గడంతో గతంలో చేసిన మెంబర్షిప్ చేయడానికే చుక్కలు కనపడుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 12న మెంబర్‍షిప్ డ్రైవ్ స్టార్ట్అయ్యింది. బుధవారం నాటికి 13 రోజులు గడిచింది. ఇచ్చిన గడువు ప్రకారం మరో రెండు, మూడు రోజుల్లో టార్గెట్ ఫుల్‍ఫిల్ చేయడానికితోడు వాటి బుక్కులు హైకమాండ్‍కు అప్పజెప్పాలి. దీంతో చాలాచోట్ల పైసలు ఇవ్వకున్నా పర్లేదు.. మెంబర్షిప్తీసుకోమంటూ పేర్లు రాసుకుని రిసిప్ట్లు ఇస్తున్నారు.
ఆఫర్లు.. వార్నింగ్‌లు
టీఆర్ఎస్ మెంబర్‍షిప్ డ్రైవ్‍లో భాగంగా మంత్రులు, మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ విధానాలు చెప్పడం కంటే.. ఏదో ఓచోట టీఆర్‍ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇండ్లు లేదంటే పెన్షన్ అన్నట్లు వార్నింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఫలానా స్కీం రాబోతోంది. అందులో గులాబీ కార్యకర్తలకే ఫస్ట్ప్రయారిటీ అని ఓపెన్‍గా చెబుతున్నారు. ఆ తర్వాత రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్టాపిక్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చెప్పినా టార్గెట్ కష్టమవుతోంది అనుకునే లీడర్లు.. పండుగల పూట షాపుల్లో డిస్కౌంట్లు ఇచ్చినట్లు వారి సంస్థల్లో కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించి జనాలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఘన్పూర్ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మెంబర్షిప్తీసుకున్నవారిని తమ హాస్పిటల్లో స్కానింగ్, ఎక్స్‌రే, ఆపరేషన్లకు సబ్సిడీ ఇస్తామంటూ ప్రకటించారు. ఇక టీఆర్ఎస్వాళ్లకే పథకాలు వర్తింపజేస్తామంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఇలా కుదిరితే ఆఫర్లు.. లేదంటే వార్నింగ్‌లు ఇస్తూ ఎలాగోలా మెంబర్షిప్ టార్గెట్చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
మనీ అక్కర్లేదు.. పేరు చెప్పండి చాలు
యాదాద్రి జిల్లాలో సాధారణ మెంబర్షిప్తోపాటు క్రియాశీలక మెంబర్షిప్ విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కార్యకర్తలతో మీటింగ్‌లు పెట్టి టార్గెట్లు అప్పగించారు. క్రియాశీలక కార్యకర్తలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లకు వారి కెపాసిటీ బట్టి 300 నుంచి 500 వరకు రిసిప్ట్లు ఉన్న బుక్స్ అందిస్తున్నారు. ఏం చేస్తారో తెలీదు.. మీకిచ్చిన టార్గెట్ కచ్చితంగా కంప్లీట్ చేయాలంటూ ఆదేశిస్తున్నారు. దీంతో పార్టీ మెంబర్షిప్ చేయడానికి కౌన్సిలర్లు, వార్డుమెంబర్లు, క్రియాశీలక కార్యకర్తలు ఇల్లిళ్లు తిరుగుతున్నారు. సాధారణ మెంబర్‌షిప్‌కు రూ. 30, క్రియాశీలకమైతే రూ.100 చెల్లించాల్సి ఉండగా ప్రజలు చాలామంది డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సభ్యత్వం అవసరం లేదని చెబుతున్నారు. ఇలాగైతే టార్గెట్చేరడం కష్టమని భావిస్తున్న కార్యకర్తలు ‘మీరు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పండి. టీఆర్ఎస్ మెంబర్షిప్ ఇస్తాం. రూ. 2 లక్షల ఇన్స్యూరెన్స్ ఉంది’ అని చెప్పి వివరాలు రాసుకోవడంతో పాటు సాధారణ మెంబర్షిప్ రిసిప్ట్ ఇచ్చి వస్తున్నారు. తమకు దగ్గరగా ఉన్నవారికి క్రియాశీలక మెంబర్షిప్ ఇస్తున్నారు. ఆ డబ్బులంతా వారే జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది.
రూ. 15 వేలు పెట్టుకుంటున్న
350 నుంచి 400 వరకు పార్టీ మెంబర్ షిప్ చేయాలని మా ఎమ్మెల్యే చెప్పారు. మెంబర్షిప్ చేసిన వాళ్లను పైసలడిగే పరిస్థితి లేదు. ఇండ్ల కాడికి పోతున్నా. పేర్లు, అడ్రస్, ఫోన్నంబర్తీసుకుని రిసిప్ట్ఇచ్చేస్తున్న. మొత్తంగా రూ.15 వేలు మెంబర్షిప్ కోసం నేనే పెట్టుకుంటున్న. – కౌన్సిలర్, యాదాద్రి జిల్లా
పైసలు లేక బుక్స్ రిటన్ చేయలే..
100 సాధారణ, 25 క్రియాశీలక మెంబర్షిప్ చేయాలని బుక్కులిచ్చిన్రు. మెంబర్షిప్ కోసం ఎవర్నీ పైసలడిగే పరిస్థితి లేదు. అందుకే జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది. టైంకు పైసలు అడ్జెస్ట్ కాక మెంబర్షిప్ బుక్స్ రిటన్ చేయలే. -క్రియాశీలక కార్యకర్త, యాదాద్రి జిల్లా
వెనక్కి రాని మెంబర్షిప్ బుక్స్
యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి రెండు నియోజకవర్గాల్లో 50 వేల చొప్పున, నకిరేకల్నియోజకవర్గంలోని రామన్నపేట, తుంగతుర్తిలోని మోత్కూరు, అడ్డగూడురు, మునుగోడులోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో మరో 30 వేల మెంబర్షిప్ చేయాలన్న లెక్కలున్నాయి. తీసుకున్న మెంబర్షిప్ బుక్స్ తిరిగి ఇవ్వడానికి కేడర్ లేట్చేస్తున్నారు. ఒక్కొక్కరు తమ జేబులోంచే రూ. 3 వేల నుంచి రూ.30 వేల వరకు ఇవ్వాల్సి వస్తుండడంతో లాస్ట్‌డేట్ వరకు చూద్దాంలే అన్న ధోరణిలో కేడర్ఉన్నారు. అప్పటివరకు ఎమ్మెల్యేలు సర్దుతారేమో అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చార్మినార్ దానమిస్తే రిజిస్టర్ చేసుకుంటరా?