
ల్యాబ్‌లో తయాచేసినవి కాకుండా మొక్కలు, జంతువుల నుంచి వచ్చిన పదార్థాలను నేచురల్ అంటారు. కాస్మొటిక్స్‌లో సేఫ్టీ అనేది వేరుగా ఉంటుంది. అలెర్జిక్ రియాక్షన్ వస్తుందంటే అది స్కిన్ టైప్‌కి పడలేదని అర్థం. నేచురల్ అనేది కూడా అన్ని సార్లు అందరికీ సేఫ్ కాదు. కాస్మొటిక్ ప్రొడక్ట్ అనేది చర్మం, జుట్టు, పెదాలు, గోర్లు వంటి శరీర భాగాలకు తగ్గట్టు తయారుచేస్తారు.
ఇవి చెక్ చేయాలి
- కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌లో నేచురల్, సింథటిక్ ఇంగ్రెడియెంట్స్ కాంబినేషన్స్ ఉంటాయి.
- ఏదైనా కాస్మొటిక్ ప్రొడక్ట్ కొనేటప్పుడు ఎఫ్.డి.ఎ. అప్రూవల్ అయ్యిందో లేదో గమనించాలి.
- హానికర ఇంగ్రెడియెంట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్ వాడకపోవడం బెటర్.
- ఎప్పుడైనా సరే ఒక ప్రొడక్ట్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం సేఫ్.
- అలెర్జి కలిగించే ఇంగ్రెడియెంట్స్ లేకుండా చూసుకోవాలి.
- స్కిన్ టైప్‌కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి.
- మీరు వాడే ప్రొడక్ట్ గురించి ఏవైనా రీసెర్చ్‌లు జరిగి ఉంటే ఆ విషయాల గురించి అవగాహన ఉండాలి. ప్రొడక్ట్స్ మీద కంప్లైంట్స్ ఏవైనా ఉన్నాయేమో చూడాలి.
- ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
- కొన్నిసార్లు ఇంగ్రెడియెంట్స్ అన్నీ చెక్ చేసినా వాడాక రియాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేయడం బెటర్.
ఎలా ఎంచుకోవాలి?
- కాస్మొటిక్ ఎందుకు వాడాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఎంచుకోవాలి.
- డెర్మటాలజిస్ట్‌ని అడిగి స్కిన్ టైప్ని అర్థం చేసుకోవాలి. స్కిన్‌కి ఏం అవసరమో తెలుసుకుని అవే వాడాలి.
- ఇంగ్రెడియెంట్స్ చెక్ చేయాలి. తర్వాత ప్యాచ్ టెస్ట్ చేయాలి.
డైలీ మేకప్ వేసుకుంటుంటే..
డైలీ మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది కొందరికి. మరి అది స్కిన్‌కి మంచిదేనా? అంటే.. అది రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. మేకప్‌కు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇది స్కిన్‌కి, మేకప్‌కి మధ్య అడ్డుకట్టలా ఉంటుంది. చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. నాన్ కామెడొజెనిక్ ప్రొడక్ట్స్ వాడాలి. హెవీ మేకప్స్ వేసుకోవద్దు. లేదంటే స్కిన్ పాడయ్యే అవకాశం ఉంది. మేకప్‌ని పూర్తిగా క్లీన్ చేయాలి. ప్రతి రోజు పడుకునే ముందు జెంటిల్ క్లెన్సర్స్ వాడాలి. మలినాలు తొలిగేలా శుభ్రంగా కడిగేయాలి. మాయిశ్చరైజ్ చేయడం రొటీన్ స్కిన్ కేర్‌లో భాగం కావాలి. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే రోజూ మేకప్ వేసుకున్నా ప్రాబ్లమ్ ఉండదు.