
ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 3) గ్రీన్ లో ఓపెన్ అయ్యి.. ఈ రోజు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అనుకునేలోపే ఢమేల్ న పడిపోయాయి. శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ లో ఇన్వెస్టర్లకు బ్లడ్ బాత్ చూపించిన మార్కెట్లు.. ఇవాళ పాజిటివ్ గా ఓపెన్ అవ్వడం రిలీఫ్ ర్యాలీ అనుకునే లోపే మళ్లీ ఫాల్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 327 పాయింట్లు డౌన్ వరకు వెళ్లి లాస్ లో ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 87 పాయింట్లు లో వరకు వెళ్లి 22 వేల లెవల్ దగ్గరలో ట్రేడ్ అవుతోంది.
గ్లోబల్ గా ఉన్న టెన్షన్స్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ మొదలైందన్న సంకేతాలు మార్కెట్లను డౌన్ ఫాల్ కు గురిచేస్తున్నాయి. అదేవిధంగా మంగళవారం (మార్చి4) నుంచి కెనడా, మెక్సికో, చైనాలపై యూఎస్ టారిఫ్స్ అమలు అవుతుండటం కూడా మార్కెట్లలో అనిశ్చితికి కారణం.
వాస్తవానికి ఇండియన్ జీడీపీ ఊహించినట్లుగా పాజిటివ్ గానే వచ్చింది. జీడీపీ 6.2 శాతం వృద్ధితో రూ.1.84 లక్షల కోట్ల కలెక్షన్లు రావడం ఇండియన్ గ్రోత్ స్టోరీకి కలిసొచ్చే అంశం. దీంతో మార్కెట్లు యూ టర్న్ తీసుకుంటాయేమోనన్న చిన్న హోప్ ఇన్వెస్టర్లలో నెలకొంది. కానీ ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా సెల్ చేస్తుండటంతో మళ్లీ పతనం మొదలైంది.
ఇప్పటి వరకు నిఫ్టీ ఇండెక్స్ 15.87 శాతం పడిపోయింది. ప్రస్తుతం 22,000 సపోర్ట్ దగ్గర ఉంది. అది కూడా ఫాల్ అయితే 21,800 వరకు ఫాల్ కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు.
డిసెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్ లో స్లో డౌన్, రూపాయి పతనం, డాలర్, బాండ్ ఈల్డ్ పెరుగదల కారణంగా మొదలైన FII ల అమ్మకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మార్కెట్ అట్రాక్షన్ వ్యాల్యుయేషన్స్ కు వచ్చిందని ఎనలిస్టులు అంటున్నారు.. కానీ ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గితే మార్కెట్ నష్టాలకు కాస్త బ్రేక్ పడవచ్చు.