పలుమార్లు యుద్ధం చేసినా.. కొన్నిసార్లు ఓడిపోతాం.. ఇన్‌‌‌‌స్టాలో కలెక్టర్‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌

పలుమార్లు యుద్ధం చేసినా..  కొన్నిసార్లు ఓడిపోతాం.. ఇన్‌‌‌‌స్టాలో కలెక్టర్‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : ‘కలెక్టర్‌‌‌‌గా ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. మహిళగా వివక్ష, అణిచివేతకు గురయ్యా.. ఇబ్బందులను తట్టుకున్నా... పలుమార్లు యుద్ధం చేస్తాను.. కానీ కొన్నిసార్లు ఓడిపోతాను’ అంటూ కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ పమేలా సత్పతి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పెట్టిన పోస్ట్‌‌‌‌ వైరల్‌‌‌‌గా మారింది. 

శుక్రవారం కరీంనగర్‌‌‌‌లో కేంద్రమంత్రి మనోహర్‌‌‌‌లాల్‌‌‌‌ పర్యటనలో పదే పదే తోసివేయడం పట్ల ఆఫీసర్ల తీరుపై మంత్రి శ్రీనివాసరెడ్డి అసహనానికి గురై  వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కలెక్టర్ పమేలా సత్పతి వైపు చూస్తూ ‘వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్’ అంటూ సీరియస్‌‌‌‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌‌‌‌ పెట్టిన పోస్ట్‌‌‌‌ చర్చనీయాంశంగా మారింది. అయితే పోస్ట్ పెట్టిన కాసేపటికే దానిని కలెక్టర్‌‌‌‌ డిలీట్ చేయడం గమనార్హం.