హైదరాబాద్ సిటీలో హోలీ వేవ్ .. గ్రాండ్​ సెలబ్రేషన్స్​కు సిద్ధం

హైదరాబాద్ సిటీలో హోలీ వేవ్ .. గ్రాండ్​ సెలబ్రేషన్స్​కు సిద్ధం
  • రేపు వందలకొద్దీ ఈవెంట్లు
  • ఉర్రూతలూగించనున్న సెలబ్రెటీస్​ 
  • స్టెప్పులేయించనున్న డీజేలు రెయిన్​డ్యాన్స్, టేస్టీ ఫుడ్, జాయ్ ​ఫుల్ ​గేమ్స్​ 
  • రూ. 99 నుంచి 40వేల వరకూ టికెట్ల రేట్లు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగుల పండగకు సిటీ జనం రెడీ అవుతున్నారు. గల్లీల్లో రంగులు చల్లుకునుడు కామనే అయినా..కొంతకాలంగా పబ్లిక్​ఈవెంట్స్​కు వెళ్లి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్​చేసుకొనే ట్రెండ్​ఎక్కువవుతోంది. దీంతో సిటీలో ప్రతి హోలీకి ఈవెంట్​ ఆర్గనైజర్స్​ పోటీ పడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. జనాలను రప్పించడానికి డిఫరెంట్​థీమ్స్​తో సెలబ్రేషన్స్​ఆర్గనైజ్​చేస్తున్నారు. ప్రైమ్​ఏరియాలు, హోటల్స్​, కన్వెన్షన్​సెంటర్లు, గ్రౌండ్స్, క్లబ్స్, రిసార్ట్స్​లలో ఈవెంట్స్​నిర్వహిస్తున్నారు. 

ఎక్స్​క్లూజివ్​ప్రీమియం ఏసీ లాంజ్​లతో ఉదయం 8 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. హోలీ ఆడుకోవడానికి అవసరమైన కలర్స్ తో పాటు లంచ్​లోకి టేస్టీ ఫుడ్, లైవ్​ బార్బెక్యూ స్పెషల్​మెనూ, థండాయి, చిల్​కావడానికి బేవరేజెస్ ఏర్పాట్లు చేసి ఆకట్టుకుంటున్నారు. సెలబ్రిటీస్, సింగర్స్​ను తీసుకువచ్చి ప్రతి సెకన్​ఎంజాయ్​చేసేలా ప్లాన్​చేస్తున్నారు. ఇలా సిటీలో ఈ నెల 14న  సుమారు 200కు పైగా ఓపెన్​ఎయిర్​హోలీ ఈవెంట్స్​జరగనున్నాయి. వీటికి రూ.వంద నుంచి మొదలుకుంటే ఫెసిలిటీస్​ను బట్టి రూ.40వేల వరకూ టికెట్​రేట్​ఫిక్స్​చేశారు. 
 
ఓపెన్​ ఎయిర్, ఆర్గానిక్​ కలర్స్​

ఇప్పుడు హోలీ వేడకలు అన్నీ ఓపెన్​ఎయిర్​లోనే నిర్వహిస్తున్నారు. లుక్​ రావడానికి ఆకట్టుకునే స్టేజ్​లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంతదూరంలో ఉన్నా సెలబ్రిటీలు కనిపించేలా పెద్ద పెద్ద స్క్రీన్స్​ఏర్పాటు చేస్తున్నారు. డీజే వినిపించేలా చెవులు చిల్లులు పడే భారీ సౌండ్​బాక్సులను సిద్ధం చేస్తున్నారు. అలాగే కెమికల్​కలర్స్​తో స్కిన్​కు ఎఫెక్ట్​అవుతుందంటూ ఆర్గానిక్ కలర్స్​ప్రిఫర్​చేస్తున్నారు. దీంతో సిటీ యూత్​ఎక్కువగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతోంది. 

ఫేమస్​ డీజేలతో..

వేడుక ఏదైనా మ్యూజిక్​లేకపోతే బోరింగ్​గా ఉంటుంది. హోలీ అయితే ఈవెంట్స్​లో డీజే లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇక ఓపెన్​ఎయిర్​లో మ్యూజిక్​కు స్టెప్పులు వేయాలంటే ఖచ్చితంగా పేరుమోసిన డీజే ఉండాల్సిందే.. అందుకే ఈవెంట్​ఆర్గనైజర్స్​ఇండియా వైడ్​గా ఫేమస్​డీజేలను హోలీ ఈవెంట్స్​కోసం బుక్​చేస్తున్నారు. ప్రచారం కూడా అదే విధంగా చేస్తుండడంతో టికెట్స్​హాట్​కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.  

సెలబ్రిటీస్ ​ఉండాల్సిందే..

మ్యూజిక్, డ్యాన్స్​ఓకే...మరి మనకు నచ్చిన సెలబ్రిటీస్​తో సెలబ్రేషన్స్​చేసుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే ఆర్గనైజర్స్​పోటీపడి మరీ సెలబ్రిటీస్​ను తమ ఈవెంట్స్​కు బుక్​చేస్తున్నారు. ఈసారి సిటీలో జరిగే ఈ ఈవెంట్లకు కాజల్​ అగర్వాల్​తో పాటు హెబ్బా పటేల్, నిధి అగర్వాల్, అనసూయ భరద్వాజ్, మాల్వీ మల్హోత్రా​లాంటి తారలతో పాటు సింగర్స్​మంగ్లీ, నోయల్, రాధాకృష్ణలో కృష్ణుడిగా మెప్పించిన సుమేధ్​ముద్గాల్కర్, రానున్నారు. ఈ వెంట్లకు సంబంధించి టికెట్లు బుక్​మై షోతో పాటు ఇతర వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.  

రోడ్లపై హోలీ ఆడితే కేసులే.. 

హోలీ పండుగ నాడు పోలీసులు  పలు ఆంక్షలు విధించారు. రోడ్లపై హోలీ ఆడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ ​ప్లేసుల్లో హోలీ ఆడడం, తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం, అసౌకర్యం కలిగించడం, వాహనాలపై రంగులు వేయడం నేరమన్నారు. ఈ ఆంక్షలు 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

ఇవీ ఈవెంట్స్.. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే సెలబ్రేషన్స్​లో గేమ్స్ ఉంటే ఆ ఫన్​వేరుగా ఉంటుంది. దీంతో ఈవెంట్​ఆర్గనైజర్స్​వినూత్న గేమ్స్​నిర్వహిస్తున్నారు. మడ్​బాత్​, టొమాటో ఫైట్​, రెయిన్​డ్యాన్స్, లైవ్ సింగింగ్​, బెలూన్​ఛాలెంజ్​, స్ప్లాష్​సెలబ్రేషన్స్​, ట్రెడిషనల్​ధోల్​, బ్యాండ్స్, ఎక్స్ క్లూజివ్​కిడ్స్​ఎరీనా, స్కై కలర్​షాట్స్​అంటూ రకరకాల గేమ్స్​కండక్ట్​ చేయబోతున్నారు. 

హోలీ వేవ్ 

ప్లేస్: హైటెక్స్​ క్రికెట్​ గ్రౌండ్, హైటెక్ సిటీ 
సెలబ్రిటీస్​: అనసూయ, 
నిధి అగర్వాల్, విశ్వక్​సేన్​ 
ఎంట్రీ ఫీ: రూ.249 నుంచి.. 
గోల్డ్​ టేబుల్(12 మందికి): 
రూ.40 వేలు

హోలీ నేషన్ 

ప్లేస్: హెచ్ఐజీలోని 
మ్యాన్​ మేడ్ హిల్​ ఏరియా 
సెలబ్రిటీ: కాజల్​ అగర్వాల్, డీజే వినిష్​, ఉమేశ్​ ​ 
ఎంట్రీ ఫీ: రూ.199 నుంచి మొదలు;15 మందికి కలిపి రూ.39,999

రంగీన్​ ఉత్సవ్​2.0

ప్లేస్​: ఎల్బీ స్టేడియం
సెలబ్రిటీ: మంగ్లీ, డీజే డైనమిక్​
ఎంట్రీ ఫీ: 399 నుంచి మొదలు..;10 మందికి 30 వేల వరకు

సెలబ్రెటీ హోలీ 

ప్లేస్: ఫ్లిప్ ​సైడ్ ​అడ్వెంచర్ ​పార్క్​ 
సెలబ్రిటీ: హెబ్బా పటేల్​ 
ఎంట్రీ ఫీ: రూ.99 నుంచి 2,499 వరకు

బృందావన్​ హోలీ

ప్లేస్: పీపుల్స్​ ప్లాజా  
సెలబ్రిటీ : సుమేధ్​మడగాల్కర్​
ఎంట్రీ ఫీ: రూ.199
 నుంచి మొదలు; 
10 మందికి 4,799 వరకు

రంగీన్​ హైదరాబాద్​

ప్లేస్: గచ్చిబౌలి నేషనల్​ఇనిస్టిట్యూట్​
ఆఫ్​ టూరిజం గ్రౌండ్​
సెలబ్రిటీస్: సింగర్​ నోయల్, డీజే నిహారిక, డీజే ఫాల్గున్​
ఎంట్రీ ఫీ: రూ.199 నుంచి రూ.2,299 వరకు