హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నం

హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నం
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి, తుక్కుగూడ, బడంగ్​పేట్​తోపాటు కందుకూరులో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత జల్​పల్లి, బడంగ్​పేట్​లో పీహెచ్​సీలు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 

అనంతరం కందుకూరులో నెదునూర్ ​నుంచి మద్దెలకుంట తండా వరకు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.పేదల సంక్షేమం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.