తాడ్వాయి, వెలుగు : సర్పంచ్‌గా, జడ్పీటీసీగా ఆదరించిన ప్రజలు ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రుణం తీర్చుకుంటానని ములుగు బీఆర్‌ఎస్ క్యాండిడేట్ బడే నాగజ్యోతి చెప్పారు. తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందిందన్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేని, అర్హులైన గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీతో వస్తున్న కాంగ్రెస్‌లో సీఎం ఎవరో గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొర్రిబెల్లి శివయ్య, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సర్పంచ్ బాబురావు పాల్గొన్నారు