ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది భారత ఆటగాళ్లలో సీనియర్ ప్లేయర్లు శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, రవి చంద్రన్ అశ్విన్ కి చోటు దక్కలేదు. వీరితో పాటు సంజు శాంసన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా చోటు సంపాదించలేకపోయారు. వీరికి జట్టులో దక్కకపోవడంపై అందరూ పెదవి విరిచారు. అయితే వన్డేల్లో చెత్త రికార్డ్ ఉన్న సూర్యకుమార్ యాదవ్ మీద మాత్రం సెలక్టర్లు నమ్మకముంచారు. టీ 20 ల్లో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగిన సూరీడు.. వన్డేల్లో మాత్రం కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
ALSO READ:ఆసియా కప్ 2023: పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్..సొంత స్టేడియంలో వింత పరిస్థితి
లక్కీగా ఛాన్స్ కొట్టేసాడు
అనుభవం, ఫామ్ లో ఉన్నవారిని పక్కన పెట్టి సూర్యకి అవకాశం ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టామ్ మూడి, మాజీ కోచ్ సూర్యని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయడాన్ని తప్పు పట్టారు. టామ్ మూడి మాట్లాడుతూ "వరల్డ్ కప్ టీంలో సూర్యకుమార్ యాదవ్ అవసరం లేదు. అతడు గణాంకాలు చూస్తే వన్డే టీంలో ఎవరూ తీసుకోరు. సూర్య బదులు తిలక్ వర్మను తీసుకున్నా లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ గా ఎంతో కొంత ఉపయోగపడతాడు. ఇక మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ " సూర్యని తీసుకోవడం అనవసరం. అతడికి 25-40 ఓవర్ల మధ్యలో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియదు. అలాంటి వాడికి జట్టులో చోటు ఎలా ఇచ్చారు" అని చెప్పుకొచ్చాడు. వరల్డ్ ప్రారంభం అయ్యేలోపు ఇంకొందమంది సూర్యని విమర్శించినా ఆశ్చర్యం లేదు.