Delhi Results: కేజ్రీవాల్ vs పర్వేశ్ సింగ్.. రౌండ్ రౌండ్కూ టెన్షన్

Delhi Results: కేజ్రీవాల్ vs పర్వేశ్ సింగ్.. రౌండ్ రౌండ్కూ టెన్షన్

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో దోబూచులాడుతున్నాయి. న్యూ ఢిల్లీ స్థానం నుంచి 4వ సారి పోటీ పడుతున్న కేజ్రీవాల్ కు కౌంటింగ్ లో ప్రతి రౌండూ చాలెంజింగ్ గా మారింది. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సింగ్ గట్టి పోటీని ఇస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఒక్కో రౌండులో ఒక్కొక్కరూ లీడింగ్ లోకి రావడం టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. 

ఫలితాల లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత.. తొలి రెండు రౌండ్లలో బీజేపీ క్యాండిడేట్ పర్వేశ్ సింగ్ ముందంజలో కొనసాగారు. దీంతో ఆప్ నేతలు టెన్షన్ కు గురయ్యారు.

 ఆ తర్వాత మూడు, నాలుగో రౌండ్లలో కేజ్రీవాల్ ముందంజలోకి వచ్చారు. చాలా తక్కువ మార్జిన్ తో లీడ్ లోకి వచ్చారు. ఇద్దరి మధ్య రెండు వందల మార్జిన్ ఉండటం గమనార్హం. 

ALSO READ | Delhi Results 2025: మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి: జమ్ము కాశ్మీర్​​ సీఎం ఒమర్​ అబ్దుల్లా..

ఆ తర్వాత 6, 7వ రౌండ్లలో కేజ్రీవాల్ మళ్లీ ట్రయలింగ్ లో పడిపోయారు. 7వ రౌండ్ లో 238 ఓట్లతో బీజేపీ అభ్యర్థి లీడ్ లోకి వచ్చారు. 

కేజ్రీవాల్, పర్వేశ్ సింగ్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఇంత స్వల్ప ఓట్ల మార్జిన్ తో లీడ్ మారుతూ వస్తుండటం ఇటు ఆప్, అటు బీజేపీ నేతలను టెన్షన్ కు గురిచేస్తోంది.