ప్రతి విద్యార్థిలో ప్రత్యేక టాలెంట్

  • దానికి పదును పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి 
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

ముషీరాబాద్, వెలుగు: ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్​ దాగి ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆ టాలెంట్​కు పదును పెట్టి, మంచి ఆలోచనతో సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీలో ఎంబీఏ విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ఆయనతోపాటు ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ జహంగీర్, రోషిణి హాజరయ్యారు. అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్​లో చదివే ప్రతి విద్యార్థికి తన వైపు నుంచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ విష్ణు ప్రియ, ప్రిన్సిపాల్ మీసాల అప్పలయ్య, సిబ్బంది, ఎంబీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.