కరోనాతో అక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకొకరు మృతి

కరోనాతో అక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకొకరు మృతి

ప్రపంచవ్యాప్తంగా 59వేలకు పైగా మందిని బలిగొన్న కరోనా వల్ల న్యూయార్క్ లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. శుక్రవారం ఒక్కరోజే కరోనా వల్ల న్యూయార్క్ లో అత్యధికంగా 562 మంది చనిపోయారు. అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమె అన్నారు. రాష్ట్రంలో మరియు దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 2 మరియు 3వ తేదీలలో కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య అత్యధికంగా నమోదైందని ఆయన తెలిపారు.

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 57 వేలు దాటిందని.. అయితే ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే లక్షకు పైగా నమోదయ్యాయని ఆయన అన్నారు. కాగా.. కేవలం న్యూయార్క్ సిటీలోనే 56, 289 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

For More News..

తల్లి దినాలకు 1500 మంది.. కొడుకుకు కరోనా పాజిటివ్

చైనాలో మళ్లీ కరోనా కర్ఫ్యూ..

లాక్ డౌన్ ఉన్నా అనుకున్న టైంకే పెళ్లి.. ఎలా చేసుకున్నారో తెలిస్తే..

బండి ఆపినందుకు పోలీసు గల్లా పట్టుకున్న హైదరాబాద్ మహిళ