జాతీయతను పెంచే సమైక్య యాత్ర : జీవన్

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏటా ‘భారత్ గౌరవ యాత్ర’ కొనసాగుతున్నది. ఈ యాత్రలో భాగంగా దేశంలో గల వివిధ దీవులు, ఈశాన్య రాష్ట్రాల నుంచి 30 మంది స్టూడెంట్స్​హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఫిబ్రవరి10 నుంచి13 వరకు నాలుగు రోజుల పాటు హైదరబాద్ మహా నగరంలో గల వివిధ కుటుంబాలతో మమేకమై, ఆచార వ్యవహారాల్లో నిమగ్నమై దేశమంతా ఒక్కటే, మనం అందరం భారతీయులం అనే భావనను దృఢ పరుస్తారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్టూడెంట్స్​ ఎక్స్​పీరియన్స్​ ఇన్​ఇంటర్​ స్టేట్స్​ లివింగ్ టూర్స్’ 1965లో మొదలైంది. మొట్టమొదటి సారిగా పరిషత్ కార్యకర్తలు అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించి, వారి ఆచార వ్యవహారాల్లో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. తర్వాత అంతర్జాతీయ ఛాత్ర్ జీవన్ దర్శన్ పేరుతో ‘సేయిల్ ​టూర్’ను ప్రారంభించారు.

ఇందులో భాగంగా1966 నుంచి విద్యార్థులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సాంస్కృతిక ఐక్యతను చాటుతున్నారు. దేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమై కలిసి మెలిసి ఉండటం వల్ల జాతీయతా భావం పెరుగుతుంది. ఈ విధమైన పరంపర ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. చైనా నిరంతరం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తూ అక్కడి యువకులను, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ దేశ వ్యతిరేకులను తయారు చేయాలని సంకల్పించింది. విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న ఛాత్ర్ జీవన్ దర్శన్ ప్రేరణతో అక్కడి విద్యార్థులు భారత్ కు వ్యతిరేకంగా గళమెత్తలేకపోయారు. 

- జీవన్, ఏబీవీపీ లీడర్, ఓయూ