పరమేశ్వరుడు లేని ప్రదేశం ఏ లోకంలో ఉందడని పురాణాలు .. శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులకు ప్రధాన దేవుడు ఆ పరమేశ్వరుడేనట. ఇప్పుడు భూలోకంలో మానవులు ఎలా ఉండే వారో.. సత్య యుగంలో దేవతలు.. రాక్షసులు అలా ఉండే వారట.. కొంతకాలానికి సత్యయుగంలో రాక్షసులు అంతరించారు.తరువాత త్రేతా యుగము, ద్వాపర యుగము కూడా కాలగర్భంలో కలిసి పోయి.. ఇప్పుడు కలియుగంలో మనమందరం జీవిస్తున్నామని పురణాలు చెబుతున్నాయి. కలియుగంలో మానవాళిని ఉద్దరించడానికి అనేక పూజలు, వ్రతాలను రుషులు, మహాత్ములు కొన్ని విధానాలను రూపొందించారు. ఇలాంటి పూజలను..సత్య యుగంలో కూడా దేవతలు.. మునులు వ్రతాలు చేశారని పండితులు చెబుతుంటారు. అయితే కలియుగంలో పార్వతీ పరమేశ్వరులు రాత్రి సమయంలో ఓ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని.. పచ్చీస్ ఆడుకుంటారట.. ఇప్పుడు ఆప్రాంతం విశేషాలను తెలుసుకుందాం...
హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు. ఓ ఆలయంలో శివుడు రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటాడట. అందుకే ఆయన కోసం మంచం కూడా వేస్తారు.
ఓం ఆకారంలో ఉండే ద్వీపంలో ఉంటాడీ శివయ్య. అందుకే ఆయనను ఓంకారేశ్వరుడని పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాంధాత అనే ద్వీపంలో ఈ ఓంకారేశ్వర ఆలయం ఉంది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు ఓంకారేశ్వర, మమలేశ్వర రూపాలలో పూజలందుకుంటాడు. ఇక ఇక్కడి శివయ్య విశేషాలు చాలానే ఉన్నాయి. శివుడు రోజూ రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం.
మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ శివయ్య పార్వతీమాతతో పచ్చీస్ ( అష్టాచెమ్మ లాంటిది) ఆడుతాడట. అందుకే పచ్చీసు ఆటకు ఏర్పాట్లు చేసి మరీ ఆలయ తలుపులను రాత్రివేళ మూసివేస్తారు. ఇక ఆలయ తలుపులు మూసేశాక అటు వైపుగా ఎవరూ వెళ్లరు. ఇక పచ్చీస్ ఆడుతారనడానికి నిదర్శనంగా ఉదయానికి పాచికలన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో పాటు పాచికలు ఆడినట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపిస్తాయట.
ఇక ఇక్కడి నర్మదా నదిలో స్నానమాచరించి శివయ్యను పూజించుకుంటే సకల పాపాలు నశిస్తాయట. ఇక్కడ పూజలు చేస్తే ఆధ్మాత్మిక బలం కూడా లభిస్తుందని నమ్మకంఇక్కడ స్వామివారు ఓంకారేశ్వర, మమలేశ్వర రూపాలలో పూజలందుకుంటాడు. ఇక ఇక్కడి శివయ్య విశేషాలు చాలానే ఉన్నాయి. శివుడు రోజూ రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం. శివ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. అందుకే ఈ ఆలయానికి ఓంకారేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రాసస్త్యం గురించి స్కంద పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి హిందూ మతంలోని అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇక్కడ శివుడు ఓంకారేశ్వర, మమలేశ్వర అనే రెండు రూపాలలో పూజించబడతాడు.
ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించిన పౌరాణిక కథ
ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించి కొన్ని పౌరాణిక కథనాలు ఉన్నాయి. వాటిలో మాంధాత రాజుకు సంబంధించిన కథ చాలా ప్రత్యేకమైనది. ఈ పురాణం ప్రకారం పురాతన కాలంలో మాంధాత రాజు చాలా శక్తివంతమైన పాలకుడు. అతను గొప్ప శివ భక్తుడు. ఒకసారి అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. అనుగ్రహం పొందడానికి ఓంకార పర్వతం మీద ఉన్న నర్మదా నది ఒడ్డున కఠినమైన తపస్సు ప్రారంభించాడు. అతని కఠిన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ తపస్సు తీవ్ర రూపం దాల్చి మొత్తం విశ్వంపై ప్రభావం చూపింది. అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై రెండు వరాలను అడగమని అడిగాడు.
మొదటి వరంలో మాంధాత రాజు ఈ పవిత్ర స్థలంలో ఎల్లప్పుడూ ఉండి భక్తులందరి కోరికలను తీర్చమని శివుడిని కోరాడు. ఈ పుణ్యక్షేత్రం పేరుతో పాటు నా పేరు కూడా మీతో కలకాలం నిలిచిపోవాలని ప్రజలు తనను స్మరించుకోవాలని రెండో వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు శివుడు ...మాంధాత రాజు రెండు కోరికలను నెరవేర్చాడు. జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో నివసించడం మొదలు పెట్టాడు. అందుకే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపం. అంటే ఇక్కడ శివలింగం ఏ దేవుడు, మానవుడూ నిర్మాణం కాదు.. స్వతహాగాఉద్భవించిందని విశ్వసిస్తారు. అప్పటి నుండి శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ఈ పవిత్ర స్థలంలో ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని మాంధాత అని పిలుస్తారు.