![Gautam Gambhir: టీమిండియాపై గంభీర్ పిచ్చి ప్రయోగాలు.. ఆ రెండు విషయాల్లో ఫ్యాన్స్ ఫైర్](https://static.v6velugu.com/uploads/2025/02/everyone-criticized-gambhirs-experiments-on-team-india_RcdsjmPICe.jpg)
టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ భారత క్రికెట్ పై అనవసర ప్రయోగాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. గంభీర్ కొంతమంది ఆటగాళ్ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడని నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ వరుసగా రెండు వన్డే మ్యాచ్ లు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత జట్టుగా విజయాలు సాధిస్తున్నా రెండు విషయాల్లో గంభీర్ ఆలోచనలు ఎవరికీ అర్ధం కావట్లేదు.
రాహుల్ ఆరో స్థానంలో:
టీమిండియా ప్రధాన బ్యాటర్ గా రాహుల్ ఆరో స్థానంలో పంపడం ఎవరికీ నచ్చడం లేదు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో రాహుల్ కంటే ముందు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెండు మ్యాచ్ ల్లో రాహుల్ విఫలమయ్యాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాహుల్ బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. రెగ్యులర్ గా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే రాహుల్.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం వలన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతని ఆత్మవిశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో రాహుల్ అద్భుతంగా ఆడి 500 పైగా పరుగులు సాధించాడు.
అర్షదీప్ ఎక్కడ..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంగా భావించే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అర్షదీప్ సింగ్ కు తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో లేని హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న అర్షదీప్ సింగ్ కు కనీసం మూడో వన్డేలోనైనా చోటు దక్కుతుందేమో చూడాలి.
ALSO READ | Champions Trophy final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే టీమిండియాను ఓడిస్తాం: స్టార్ ఓపెనర్
టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుండి భారత్ ఊహించని పరాజయాలు ఎదుర్కొంటుంది. ద్రవిడ్ హెడ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అనుభవం లేకోపోయినా బీసీసీఐ గంభీర్ ను గుడ్డిగా నమ్మినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన కోచ్ గా గంభీర్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అతనికి నచ్చినట సహాయక కోచ్ లను నియమించింది. అయితే మూడు నెలలు గడిచేసరికి గంభీర్ కు అన్ని చేదు అనుభవాలే.
శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2తో భారత జట్టు కోల్పోయింది. 28 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై లంక సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక-బి జట్టుతో ఓడిపోయింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా 1-3 తేడాతో ఓడిపోయింది. బీసీసీఐ సైతం గంభీర్ పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. గంభీర్ తన సొంత నిర్ణయాలతో భారత జట్టుపై పనికి రాని ప్రయోగాలు చేస్తున్నాడని.. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ఫలితాలు రాకపోతే అతనికి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.