క్లాస్మేట్ కోసం ప్రీస్కూల్ స్టూడెంట్స్ ఫండ్ రైజింగ్
ఆ పిల్లల వయసు మూడు నుంచి నాలుగేళ్లే. అందరూ ప్రీస్కూల్ స్టూడెంట్స్. ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదు. అయితేనేం ఆపదలో ఉన్న తమ క్లాస్మేట్ కోసం అందరూ ముందుకొచ్చారు. ఎంతో పరిణతితో ఆలోచించి ఫండ్ రైజింగ్కు శ్రీకారం చుట్టారు. పది వేల డాలర్లు సేకరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కాలిఫోర్నియాలోని రెడ్డింగ్ కో ఆపరేషన్ ప్రీస్కూల్లో జస్పేర్ మజ్జోక్కో (4) అనే బాలుడు చదువుకుంటున్నాడు. దురదృష్టవశాత్తు జస్పేర్కు బ్రెయిన్ కేన్సర్ ఉందని పోయినేడాది తెలిసింది. దీంతో జస్పేర్ను ఆస్పత్రిలో చేర్పించారు. సర్జరీకి 50 వేల డాలర్లు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. ఎలాగైనా జస్పేర్ ఫ్యామిలీకి సహాయం చేయాలని పిల్లలు నిర్ణయించుకున్నారు.
‘‘లెమనోడ్ స్టాల్ పెడదామని మా అమ్మాయి ఐడియా ఇచ్చింది. అయితే ఇది చలికాలం కదా! అందుకే హాట్ కోకో స్టాండ్పెడదామని నిర్ణయించాం” అని ప్రీస్కూల్లో చదువుకునే ఓ చిన్నారి తల్లి, ఫండ్ రైజర్ బెక్కీ హస్కిన్ తెలిపారు. స్థానికుల సహాయంతో జనవరి 10న ‘‘కోకో ఫర్ఏ క్యూర్” పేరుతో హాట్ కోకో స్టాండ్ ఏర్పాటు చేసి 10వేల డాలర్లు సేకరించారు. దీనికి పాపులర్ కాఫీ హౌస్ స్టార్బక్స్, వేర్హౌస్ క్లబ్ కొస్కో కూడా సహాయం చేశాయి. మరోవైపు జస్పేర్ తల్లిదండ్రులు ‘గో ఫండ్ మీ’’ పేజ్ ద్వారా 32వేల డాలర్లు సేకరించారు.