బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్
వికారాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని యజ్ఞ ఫౌండేషన్‌లో అనాథ పిల్లలకు స్టాంప్ వెండర్ అశోక్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే లక్ష్యాలను పెట్టుకుని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలన్నారు. ఉపాధ్యాయుల్లోనే తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు. యజ్ఞ ఫౌండేషన్‌కు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. డాక్టర్ ఉజ్వల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.