పీసీసీ అధికార ప్రతినిధులకు మాణిక్ రావ్ ఠాక్రే సూచన
హైదరాబాద్, వెలుగు: పార్టీ రూల్స్, సిద్ధాంతాలు తెలుసుకుని దాని ప్రకారమే అందరు పని చేయాలని పీసీసీ అధికార ప్రతినిధులకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే సూచించారు. అధికార ప్రతినిధుల బాధ్యత ఎక్కువని, అందుకు తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక అంశాల్లో ప్రజల తరఫున పోరాడాలని పిలుపు నిచ్చారు. జిల్లాల్లోని సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక సమస్యలపై వెంటనే స్పందిస్తే.. ప్రజలు మనవైపే నిలబడతారని చెప్పారు.