- అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు
- అన్నిచోట్ల ఐదెంచల భద్రతా వ్యవస్థ
- ఈఎంలతో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుండగా.. అధికార యంత్రాంగం ఐదెంచల భద్రత ఏర్పాటు చేసింది. గురువారం ఆయా నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నిక సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. వారు సామగ్రిని సరిచూసుకొని ఈసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సెంటర్లకు తరలివెళ్లారు. దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండలోని డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్లను నల్గొండ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
తుంగతుర్తి మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సూర్యాపేట కలెక్టర్ వెంకట్‌రావు, భువనగిరి, ఆలేరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిబ్బంది పోలింగ్ అయిపోయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పైఅధికారులకు చెప్పాలని సూచించారు.
నల్గొండలో 1768 పోలింగ్ కేంద్రాలు
నల్గొండలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 1768 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో 8140 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 378 క్రిటికల్, షాడో పోలింగ్‌స్టేషన్లలో 410 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగె కేంద్రానికి తెచ్చేందుకు 1400 మంది వలంటీర్లను సిద్ధం చేశారు. మొత్తం 1,585 వాహనాలను ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు తరలించేందుకు ఉ పయోగిస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో 566 సెంటర్లు
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని 566 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత మధ్య జీపీఎస్ అమర్చిన 123 బస్సుల్లో ఈవీఎంలు, సిబ్బంది తరలివెళ్లారు. ఐదెంచల భద్రత మధ్య తొమ్మిది అబ్జర్వేషన్ టీంల పర్యవేక్షణలో వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ జరగనుంది. మఫ్టీలో మూడు టీంలు నిరంతరం పోలింగ్‌ను పర్య వేక్షించనున్నాయి. ఎన్నికల విధుల్లో 3,955 మంది విధులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 1201 సెంటర్లు
సూర్యాపేట జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 5,772 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 173 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా. 199 మంది కేంద్ర బలగాలను నియమించారు. సెక్టార్ అధికారుల ప్రతి వెహికల్‌కు జీపీఎస్ సిస్టమ్ పెట్టారు. 3,500 మంది పోలీస్ టీమ్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.