ఆ కుటుంబంలో అంతా విషాదమే .. నాలుగు నెలల్లో ముగ్గురు మృతి

ఆ కుటుంబంలో అంతా విషాదమే .. నాలుగు నెలల్లో ముగ్గురు మృతి

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల రామన్నపేట మాజీ సర్పంచ్ వకులాభరణం అరుణ(60) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు నెలల క్రితం అరుణ కొడుకు మణిదీప్ (35) ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టంత ఎదిగిన కొడుకు చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె అతడినే తల్చుకుని ఏడుస్తోంది. 

అరుణ భర్త రామన్నపేట మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వకులాభరణం శ్రీనివాస్(65) కూడా కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ దిగులుతోనే నాలుగు రోజుల క్రితం మరణించాడు. నాలుగు నెలల వ్యవధిలో కొడుకు, భర్త కన్నుమూయడంతో తట్టుకోలేక గురువారం అరుణ కూడా తనువు చాలించింది. ఇప్పుడు ఆ కుటుంబంలో శ్రీనివాస్​, అరుణల చిన్న కొడుకు మౌర్య ఒక్కడే మిగిలాడు. గురువారం జరిగిన అరుణ అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.