బీఆర్ఎస్​ పాలనలో అన్నీ ఇబ్బందులే

భైంసా, వెలుగు:  బీఆర్ఎస్​ పాలనలో ప్రజలు అన్నీ ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​ రావు పటేల్​ఆరోపించారు. శుక్రవారం  మండలంలోని మిర్జాపూర్​, సిద్దూర్​ గ్రామాల్లో పల్లె పల్లెకు బీజేపీ, -గడప గడపకు మోహన్​రావు కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముథోల్​నియోజకవర్గం అభివృద్ధిపై  ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరారు.   వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, మోదీ పాలనలో అన్నివర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ్​ మాధవ్​ రావు పటేల్​, లీడర్లు సంజీవ్​, రవి తదితరులు పాల్గొన్నారు.