
రాయికోడ్, వెలుగు : రాయికోడ్ లో వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం జాతర మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల2 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి తెలంగాణ నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. పల్లకీ సేవా, అగ్ని గుండాల కార్యక్రమాలు అతి పవిత్రంగా భావిస్తారు. వీరభద్రేశ్వర ఆలయం నుంచి బసవేశ్వర ఆలయానికి రథోత్సవం ఊరేగించడంతో జాతర ప్రారంభమై రథం తిరిగి వీరభద్రేశ్వర ఆలయానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 27న ధ్వజారోహణం, శిఖర పూజ, స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన, 28న మహారుద్రాభిషేకం, పల్లకీ సేవా, అగ్నిగుండం, గణపతి హోమం, రథోత్సవం, 29న సహస్ర బిల్వార్చన, 30న శతనామవళి బిల్వార్చన, భద్రకాళీ మాత కుంకుమార్చన,1న అభిషేకం, ఆకుల పూజ, 2న వీరభద్రేశ్వర, భద్రకాళిల అభిషేకం నిర్వహిస్తారు.