నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు : రాజీవ్ ​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు:  జిల్లాలో కేంద్రంలోని గోడౌన్​ నుంచి  నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపిక చేసిన స్ట్రాంగ్​రూమ్​లకు శనివారం ఈవీఎం, వీవీ ప్యాడ్​లను తరలించారు. కలెక్టర్​ రాజీవ్ ​గాంధీ హన్మంతు పర్యవేక్షణలో పొలిటికల్​ పార్టీల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఓటరు లిస్ట్​ ప్రమాణికంగా సెగ్మెంట్లకు ఈవీఎంలను విభజించారు. వాటి పనితీరును నిర్ధారించాక సీల్​వేసి నియోజకవర్గాల రిటర్నింగ్​ఆఫీసర్లకు అప్పగించారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్​ రూమ్​లకు చేర్చారు.

రూ.10 లక్షల లోపు సొమ్ము రిలీజ్​కు గ్రీవెన్స్ సెల్​

ఎన్నికల నిబంధనల్లో భాగంగా తనిఖీ అధికారులకు పట్టుబడిన రూ.10 లక్షల లోపు సొమ్మును రిలీజ్​చేయడానికి గ్రీవెన్స్​సెల్​కు పవర్ ఉందని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు 27 గ్రీవెన్సులు ​పరిష్కరించి రూ.48.29 లక్షల నగదు తిరిగి అప్పగించమన్నారు. అడిషనల్​కలెక్టర్ ​యాదిరెడ్డి, కోఆపరేటివ్​  డిప్యూటీ రిజిస్ట్రార్, జిల్లా ట్రెజరరీ ఆఫీసర్​ నేతృత్వంలో సెల్​ పనిచేస్తోందన్నారు. రూ.10 లక్షలకు మించి డబ్బు, బంగారం, వెండి పట్టుబడితే ఇక్​కమ్​ ట్యాక్స్ ​వారికి  అప్పగిస్తామన్నారు.