
జనగామ అర్బన్, వెలుగు : జనగామ కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌లో కొనసాగుతున్న ఫస్ట్ లెవల్ చెకింగ్‌ను కలెక్టర్ శివలింగయ్య, సీఈవో ఈవీఎం కన్సల్టెంట్ఆఫీసర్ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14వ తేదీ లోగా అన్ని ఈవీఎంల తనిఖీ పూర్తవుతుందని చెప్పారు. 10 మంది ఇంజనీర్లు, 150 మంది సిబ్బందితో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చెకింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వారి వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, పార్టీల ప్రతినిధులు రావెల రవి, విజయ భాస్కర్, ప్రవీణ్, అజయ్ పాల్గొన్నారు.