ఈవీఎంలతో ఎన్నికలు ఈజీ

మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు మొత్తం ఎలక్షన్ ప్రక్రియలోనే రివల్యూషన్ తెచ్చాయి. ఈవీఎంల వాడకం ఫస్ట్ టైమ్ 1999లో మొదలైంది. 2018లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలనే ఉపయోగించారు. బ్యాలెట్ పేపర్ విధానం బదులుగా ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి పనితీరుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలన్నీ పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్‌ ని పోలిం గ్‌ కు ఉపయోగిం చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌‌ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

ఈవీఎంలు ఉపయోగించడం వల్ల ఫలితాలు తారుమారు అవుతాయన్న అనుమానాలకు ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపరును ఉపయోగించడం వల్ల  ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయన్న గ్యారంటీ ఏమీ లేదంటున్నారు సాంకేతిక నిపుణులు. బ్యాలెట్ పత్రాలు ఎత్తుకుపోవడం, పత్రాలపై ముందుగా ముద్రలు వేసినవాటితో బాక్సులు నింపడం, ప్రత్యర్థులకు ఓటేసిన బ్యాలెట్ పత్రాలను చించివేయడం, బాక్సుల్ లో ఇంకుపోయడం, ఏకంగా బ్యాలెట్ పత్రాలున్న బాక్సులను మాయం చేయడాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. చాలా మంది సాంకేతిక నిపుణులు ఈవీఎంల పద్ధతిని సమర్థిస్తున్నారు.