మునుగోడులో పోలింగ్ సమయం ముగిసినా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో EVM లు మొరాయిస్తున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా ఈవీఎంలు పనిచేయకపోవడంతో దాదాపు 250 మంది ఓటర్లు టెంట్ల కింద కూర్చుని ఓటు వేసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఉదయం నుంచి వేచి చూసినా ఓటు వేయకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు.
250 మందికి టోకెన్లు అందజేసిన అధికారులు..ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈవీఎంలు పనిచేస్తాయో లేదో కూడా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.