Election Commission: ఈవీఎంలపై తులసీ గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎలక్షన్ కమిషన్ క్లారిటీ..

Election Commission: ఈవీఎంలపై తులసీ గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎలక్షన్ కమిషన్ క్లారిటీ..

గత కొంత కాలంగా ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.2024 ఎన్నికల తర్వాత ఈవీఎం పనితీరుపై పలు అనుమానాలు ఎక్కువయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈవీఎం లను రీకౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ ఈవీలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీలంలను ట్యాంపరింగ్ చేయొచ్చంటూ బాంబు పేల్చారు. ఈవీఎం లను హ్యాకింగ్ చేయొచ్చు, ఈవీఎం ల ద్వారా ఎలక్షన్లు చాలా బలహీనమైనది అన్న తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ణానేష్ కుమార్ స్పందించారు. 

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ణానేష్ కుమార్ శనివారం (ఏప్రిల్ 12) తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వివాదాస్పదవ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. దేశాలనుబట్టి ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది..ఈవీఎం చాలా సేఫ్.. ట్యాంపరింగ్ చేయడం సాధ్యంకాదు అని అన్నారు జ్ణానేష్ కుమార్. 

ఎందుకు ఈవీఎంలు సేఫ్.. CEC వివరణ.. 

ఈవీఎంల సేఫ్టీపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ణానేష్ కుమార్ క్లారిటీ ఇస్తూ ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్ కు కనెక్ట్ చేయడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ట్యాంపరింగ్ గానీ,హ్యాకింగ్ గానీ ఎలా సాధ్యమవుతుందన్నారు. మనదేశంలో ఉపయోగించే ఈవీఎంను ఏవిధంగానూ అనుసంధానించలేం.. ఐదు కోట్ల VVAPPA స్లిప్‌లను లెక్కించాం.. ఎటువంటి వ్యత్యాసాలు కనిపించలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ణానేష్ కుమార్  తెలిపారు. 

భారత్ లో PSUలు తయారు చేసిన EVMలను ఉపయోగించారు. ఈ యంత్రాలపై చట్టపరమైన సమీక్ష కూడా జరిగింది. EVMలను బ్లూటూత్ ఇన్‌ఫ్రారెడ్‌కి అనుసంధానించలేం..కాబట్టి వాటిని ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు అని అన్నారు. 

తులసి గబ్బార్డ్ ఏమన్నారంటే..

ఏప్రిల్ 10న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశంలో యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గబ్బార్డ్ మాట్లాడుతూ.. పోలైన ఓట్ల ఫలితాలను తారుమారు చేయడానికి EVS దోపిడికి గురయ్యే అవకాశం ఉంటుంది..ఇంటెలిజెన్స్ విభాగం వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాబట్టి పేపర్ బ్యాలెట్ ఎన్నికలకే DNI మద్దతు అని ప్రకటించారు. 

గబ్బార్డ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమంటుంది..

గబ్బర్డ్ వాదన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందించారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై స్వయంగా విచారణ చేపట్టి దర్యాప్తు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల హ్యాకింగ్,పనితీరుపై వివరాలను సేకరించడానికి ఈసీ,కేంద్రం అమెరికా ప్రభుత్వం,గబ్బర్డ్‌ను సంప్రదించాలని ఆయన అన్నారు.