ఆంధ్ర ప్రదేశ్ లో మే 13వ తేదీ సోమవారం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో పడ్డారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వై.రామవరం మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన గుర్తేడు, పాతకోట పోలీస్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు రంపచోడవరం తరలించేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 11వ తేదీ శనివారం రంపచోడవరం డిగ్రీ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ ట్రయన్ రన్ నిర్వహించారు ఎన్నికల అధికారులు.