భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు, పారాయణాలు భక్తులకు వినిపించేలా ఆలయం నుంచి తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు, ఆలయం నుంచి బ్రిడ్జి సెంటర్లోని ఫైర్ స్టేషన్ వరకు మైక్ సెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో రమాదేవి బుధవారం తెలిపారు.
ఇందుకు రూ.4లక్షలు ఖర్చు అవుతుందని, దాతల సహకారంతో ఆగస్టు 20 లోపు పనులు పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు. సీతారామచంద్రస్వామికి బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. 14 జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువులో పాల్గొన్నాయి.