అక్రమ కట్టడాలు కూల్చివేత : ఈవో శ్రీనివాసరావు

అక్రమ కట్టడాలు కూల్చివేత : ఈవో శ్రీనివాసరావు

భద్రాచలం/వైరా, వెలుగు :  భద్రాచలం పట్టణంలో ఆర్టీసీ బస్టాండు వెనుక భాగంలో తహసీల్దారు క్వార్టర్​ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో డ్రైన్లపై నిర్మించిన 10 దుకాణాలను గురువారం ఈవో శ్రీనివాసరావు నేతృత్వంలో స్టాఫ్​ కూల్చేశారు. ఈ స్థలంలో పోలీస్​ భవనం నిర్మించడానికి రెవెన్యూ శాఖ స్థలం కేటాయించింది.

ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.  వైరా మున్సిపాలిటీ 14 వార్డు   శాంతినగర్ ఎస్టీ కాలనీ రైతు వేదిక సమీపంలో అనుమతులు లేకుండా ఎన్ఎస్పీ కాల్వపై కట్టిన ఇంటిని మున్సిపల్  అధికారులు కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణు టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్, రెవెన్యూ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.