
సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. ఎ లవ్ స్టోరీ ఇన్ రివర్స్ అనేది క్యాప్షన్. రామ్‌యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు.
షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్‌యోగి మాట్లాడుతూ ‘స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లనుంది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.